: ‘భూసేకరణ’పై కాంగ్రెస్ కు అవగాహన లేదు: వెంకయ్యనాయుడు విమర్శ
విపక్ష కాంగ్రెస్ పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మరోమారు విమర్శల వర్షం కురిపించారు. గతంలో ఆ పార్టీ చేసిన తప్పులను తమపై రుద్దుతోందని ఆయన ఘాటుగా స్పందించారు. భూసేకరణ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు అసలు ఆ చట్టంపై అవగాహనే లేదని ఆయన తేల్చిచెప్పారు. రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో తమ ప్రభుత్వంపై నిందలేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఎప్పటికైనా వాస్తవాలను ఒప్పుకుని తీరాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.