: వనరులను సక్రమంగా వినియోగిస్తేనే రెండంకెల వృద్ధి సాధించగలం: చంద్రబాబు


రాష్ట్రాభివృద్ధి కోసం 7 మిషన్లు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్, టర్కీ, దుబాయ్ వంటి దేశాల నుంచి ఎన్నో అనుభవాలు నేర్చుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధికి చాలా వనరులున్నాయని, ఆ వనరులు సక్రమంగా వినియోగిస్తేనే రెండంకెల వృద్ధి రేటు సాధించగలమని దిశానిర్దేశం చేశారు. ప్రపంచంతో పోటీపడి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. విజయవాడ గేట్ వే హోటల్ లో కలెక్టర్ల సదస్సు ఏర్పాటయింది. చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అధికారులు వినూత్న పంథాలో కొత్త ఆలోచనలతో పనిచేయాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ మిగులు స్థాయికి వచ్చిందని, కోతలు లేకుండా చూడాలని సూచించారు. జలవనరుల మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పట్టిసీమ ప్రాజెక్టు వద్దే ఉండి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. అది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News