: ఆనందపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న సుబ్బరామిరెడ్డి
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి విశాఖ జిల్లాలోని ఆనందపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని విశాఖలో ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం'లో భాగంగా ఎంపీ ఈ గ్రామాన్ని దత్తత చేసుకున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, మంచినీరు, ఆసుపత్రి, పాఠశాల వంటి పలు సౌకర్యాలను తన ఎంపీ నిధుల ద్వారా కల్పించాల్సి ఉంటుంది. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఈ సందర్భంగా కోరారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో అందరికంటే ఎక్కువ బాధ్యత టీడీపీపైనే ఉందని చెప్పారు.