: స్వచ్ఛ భారత్ అట్టర్ ఫ్లాప్... తేల్చేసిన ‘లోకల్ సర్కిల్స్’ సర్వే


సోషల్ మీడియాను మెరుగైన రీతిలో వినియోగించుకుని అఖండ విజయాన్ని సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’పై దేశ ప్రజలు పెదవి విరిచేశారు. దాదాపు 71 శాతం మంది దేశ ప్రజలు ఈ పథకం ఘోరంగా విఫలమైందని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆన్ లైన్ సర్వే సంస్థ ‘లోకల్ సర్కిల్స్’ తాజాగా నిర్వహించిన సర్వే గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందితో నెట్ వర్క్ కలిగి ఉన్న ‘లోకల్ సర్కిల్స్’ భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందనను రాబట్టింది. గడచిన ఏడాది కాలంలో తమ సిటీలో పారిశుద్ధ్యం మెరుగుపడిన దాఖలాలేమీ కనిపించలేదని సర్వేలో పాలుపంచుకున్న 71 శాతం మంది ప్రజలు అభిప్రాయపడగా, ఫరవాలేదని కేవలం 12 శాతం మంది మాత్రమే చెప్పారు. అసలు మునిసిపాలిటీలు స్వచ్ఛ భారత్ నే చేపట్టడం లేదని 72 శాతం మంది నిర్మోహమాటంగా చెప్పేశారు. ఈ పథకంలో ప్రజాభిప్రాయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఏకంగా 94 శాతం మంది డిమాండ్ చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News