: 'చుంబనం, నిట్టూర్పు'లపై అధ్యయనం చేసిన వారికి ఈ ఏటి 'ఐజి నోబెల్' బహుమతి!


గాఢంగా అధర చుంబనం చేస్తే, శరీరంలో ఏ భాగాలు ప్రేరేపితం అవుతాయి? ముద్దుతో కలిగే లాభాలేంటి? సాధారణంగా ఓ జంట ఎంత సేపు పెదవులు కలిపి ఉంచగలుగుతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలను అధ్యయనం చేసిన టీమ్ కు ఈ సంవత్సరం 'కామికల్ సైంటిఫిక్ అచీవ్ మెంట్స్' విభాగంలో 'ఐజి నోబెల్' బహుమతి లభించింది. వీరితో పాటు 'హు' అని నిట్టూర్చడంపై రీసెర్చ్ చేసిన వారికి, 17వ శతాబ్దంలో, నార్త్ ఆఫ్రికా చక్రవర్తి 30 సంవత్సరాల వ్యవధిలో 888 మంది పిల్లలకు ఎలా జన్మనిచ్చారని పరిశోధన చేసిన టీమ్ కూ 'ఐజి నోబెల్' లభించింది. అయితే, ఇది ఒరిజినల్ నోబెల్ బహుమతి కాదు సుమా! వచ్చే నెలలో వివిధ విభాగాల్లో నోబెల్ కమిటీ, మొత్తం 10 మంది అవార్డు విజేతలను ప్రకటించనున్న నేపథ్యంలో, ప్రతియేటా జరిగే 'స్ఫూవ్ నోబెల్' అవార్డుల వివరాలివి. ఒక విధంగా చెప్పాలంటే, 'పేరడీ నోబెల్' బహుమతులన్న మాట. సరదాగా నవ్వు తెప్పించే కామెడీ అవార్డులుగా కూడా వీటిని పరిగణిస్తారు. ఈ కార్యక్రమం మసాచుసెట్స్ లోని హార్వార్డ్ వర్శిటీలో జరిగింది. రియల్ నోబెల్ విజేతలు, ఈ వినూత్న రీసెర్చ్ అంశాలను ఎంచుకున్న వారికి బహుమతులు అందించారు. ఇందులో మూడు అవార్డులు రీసెర్చర్లకు దక్కాయి. సైకాలజీ విభాగంలో, శరీరంలో ఎక్కడ తేనెటీగ కుడితే అధికంగా నొప్పి కలుగుతుందో స్వయంగా పరిశోధించిన మైఖేల్ ఎల్ స్మిత్ కు అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News