: అండమాన్ లో చినరాజప్ప... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరుఫున ప్రచారం
టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అండమాన్, నికోబార్ దీవుల పర్యటనకు వెళ్లారు. ఏదో విహార యాత్రకు చినరాజప్ప వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, అక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకే ఆయన అండమాన్ వెళ్లారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అండమాన్ వెళ్లిన చినరాజప్ప అక్కడ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అండమాన్ లోని తెలుగు ప్రజలకు అండగా ఉంటామని చెబుతూ ఆయన ముందుకు సాగుతున్నారు.