: తల్లిదండ్రులు బైక్ కొనివ్వడానికి నిరాకరించడంతో విద్యార్థి ఆత్మహత్య


చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలం బండకిందిపల్లె గ్రామానికి చెందిన మహ్మద్ ఖాన్ అనే 16 సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కురుబలకోట మండలంలోని ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరూ కళాశాలకు బైక్ పై రావడం చూసి తనకు కూడా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. అందుకు వారు నిరాకరించారు. బైక్ పై వెళితే ప్రమాదాలు జరుగుతాయని, బస్సులో వెళితేనే మంచిదని చెప్పారు. దాంతో మనస్తాపం చెందిన మహ్మద్ ఆవేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • Loading...

More Telugu News