: మన భూమి ఇంతందంగా ఉందా?... హల్ చల్ చేస్తున్న బెలూన్ వీడియో, మీరూ చూడండి!


రెండు సంవత్సరాల నాడు స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన కొందరు ఔత్సాహిక విద్యార్థులు చేసిన ప్రయోగం ఫలితాలు లేటుగా వెలుగులోకి వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో లేటెస్టుగా హిట్ అయ్యాయి. యూఎస్ లోని ఆరిజోనా ప్రాంతంలో హై రెజల్యూషన్ కెమెరాను అమర్చిన బెలూన్ ను ఆకాశంలోకి పంపగా, అది వీడియో తీస్తూ, అంతరిక్షం అంచు వరకూ వెళ్లి కిందపడిపోయింది. దాన్ని రెండేళ్ల పాటు వెతుకులాడిన వర్శిటీ విద్యార్థులు ఇటీవలే కనుగొన్నారు. ఆ బెలూన్ కు అమర్చిన కెమెరాలోని దృశ్యాలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. దాదాపు 30 కి.మీ ఎత్తునుంచి కలరాడో నది, గ్రాండ్ కానియన్ లతో పాటు వివిధ ప్రాంతాలను ఈ బెలూన్ కెమెరా సుస్పష్టంగా వీడియో తీసింది. ఇంతవరకూ ఎవరూ చూడని దృశ్యాలను అందించింది. చాలా రోజుల తరువాత తాము పంపిన కెమెరా ఫుటేజ్ లకు ఆ విద్యార్థులు చేసిన కృషిని కలుపుతూ, నాలుగు నిమిషాల నిడివున్న వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా, ఇప్పటికే 44 లక్షల మందికి పైగా చూశారు. ఆకాశం నుంచి భూమి ఇంత అందంగా కనిపిస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News