: రుణమాఫీ పొలిటికల్ గిమ్మిక్కే... ప్రజాధానం వృథా అవుతోందన్న అన్నా హజారే
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అమలు చేస్తున్న రుణమాఫీ తరహా పథకాలపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఫైరయ్యారు. రుణమాఫీతో ప్రజా ధనం వృథా కావడం మినహా పెద్దగా ప్రయోజనమేమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. రుణమాఫీ పథకం ఓ పొలిటికల్ గిమ్మిక్కేనని కూడా హజారే ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో రుణమాఫీ పేరిట పలు రాష్ట్రాలు అమలు చేసిన పథకం పెద్దగా ప్రయోజనాలేమీ అందివ్వలేదని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా పథకాలు రైతులు ఎవరో ఒకరిపై ఆధారపడేలా చేయడమే కాక అన్నదాతలను నిస్సహాయ పరిస్థితిలోకి నెడతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.