: లిబియా ‘చెర’ నుంచి తప్పించుకున్న ఒడిశా వాసి... తెలుగు వ్యక్తి క్షేమమని వెల్లడి


లిబియా తిరుగుబాటుదారుల బందీలుగా ఉన్న ఇద్దరు ప్రవాస భారతీయుల్లో ఓ వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఒడిశాకు చెందిన ప్రవాస్ రంజన్ సమాల్ తిరుగుబాటుదారుల చెర నుంచి ఎట్టకేలకు తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుగుబాటుదారుల చెరలో ఉన్న తెలుగు వ్యక్తి కొసనం రామ్మూర్తి క్షేమంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమాచారంతో రామ్మూర్తి కుటుంబసభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆయన విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ రామ్మూర్తి విడుదల కోసం విశ్వప్రయత్నం చేస్తోంది.

  • Loading...

More Telugu News