: ఖైరతాబాదు వినాయకుడిని దర్శించుకున్న బాలయ్య... 'డిక్టేటర్' సినిమా యూనిట్ కూడా!


టాలీవుడ్ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న ఖైరతాబాదు వినాయకుడిని దర్శించుకున్నారు. తన తాజా చిత్రం ‘డిక్టేటర్’ యూనిట్, చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అంజలితో కలిసి ఖైరతాబాదు వచ్చిన బాలయ్య గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీవాస్ చిత్రానికి సంబంధించిన ఆడియోలోని ఓ పాటను కూడా విడుదల చేశారు. సామాన్య భక్తుల్లాగే ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా బాలయ్య ఖైరతాబాదుకు వచ్చారు. భక్తులతో కలిసి వినాయకుడిని దర్శించుకున్నారు. అనుకోని విధంగా బాలయ్య కనిపించడంతో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News