: వాడు తమ్ముడులా లేడు...మా అన్నయ్యలా ఉన్నాడు: వరుణ్ కి రామ్ చరణ్ కితాబు


వరుణ్ తేజ్ ఆరు అడుగుల పొడవుతో తనకు అన్నయ్యలా ఉన్నాడని రామ్ చరణ్ తేజ్ నవ్వుతూ అన్నాడు. 'కంచె' ఆడియో వేడుకకు హాజరైన సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, ఇలా ఉండడమే బాగుందని, వాడు అన్నయ్యలా, తాను తమ్ముడిలా, తానెప్పుడూ ఇలాగే ఉంటానని రామ్ చరణ్ చెప్పాడు. 'తమ్ముడు...కాదు అన్నయ్య వరుణ్ తేజ్ రెండో సినిమాకే ఇంత సాహసం చేశాడంటే నిజంగా గట్స్ ఉన్నాయని, మా ఫ్యామిలీలో ధైర్యమున్న నటుడు వరుణ్ తేజ్' అని రామ్ చరణ్ ప్రశంసించాడు. క్రిష్ ని నాలుగేళ్ల నుంచి సినిమా కథ చెప్పమని అడిగితే ఓ రోజు ముగ్గురు నటులతో కూడిన ఓ కథ చెప్పాడని, సెకెండ్ హాఫ్ చెబుతానని చెప్పి మాయమయ్యాడని, అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని రామ్ చరణ్ చమత్కరించాడు.

  • Loading...

More Telugu News