: యుద్ధం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతి ప్రేమ కథ హిట్టయింది: సింగీతం శ్రీనివాసరావు
హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్... ఇలా వుడ్ ఏదయినా, యుద్ధం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతి ప్రేమకథా చిత్రం సూపర్ హిట్టైందని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో జరుగుతున్న 'కంచె' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, క్రిష్ సినిమాను చాలా చక్కగా మలిచారని అన్నారు. నటీనటులు కూడా మంచి ప్రదర్శన చేశారని ఆయన తెలిపారు. 'కంచె' కూడా అలాంటి ఫలితాన్నే పునరావృతం చేస్తుందని అన్నారు. తమకు ఇలాంటి సినిమాలు తీసే అవకాశం రాలేదని, తమ తరంలో డిఫరెంట్ సినిమాలు తీశారని, తాము కూడా అలాంటి జానర్ లోనే వెళ్లిపోయామని ఆయన చెప్పారు. 'కంచె' విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమాలో సింగీతం ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.