: జగన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీం విచారణ వాయిదా
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ఇదే సమయంలో సీబీఐకి నోటీసు జారీ చేయాలని జగన్ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. అటు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్ పై కూడా విచారణను అదే తేదీకి వాయిదా వేసింది.