: సినిమాలోనే కాదు...నిజంగానే నాకు మతిమరపుంది: నాని


'భలే భలే మగాడివోయ్' సినిమాలోనే కాదు, బయట కూడా నాకు మతిమరుపు ఉంద'ని హీరో నాని చెప్పాడు. వినాయకచవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తన మతిమరుపు గురించి చెప్పుకొచ్చాడు. ఓసారి స్నేహితుడి ఆడియో ఫంక్షన్ కు వెళ్లానని, ఆ ఫంక్షన్ లో స్నేహితులైన ఇతర నటులతో మాట్లాడుతూ వారి కారులోనే ఇంటికి వచ్చేశానని చెప్పాడు. 'అయితే, మరుసటి రోజు చూస్తే ఇంటి దగ్గర కారు లేదు. ఎక్కడుందో కూడా వెంటనే గుర్తుకు రాలేదు. వెతికితే జేబులో తాళం ఉంది. అప్పుడు గుర్తొచ్చింది, నిన్న కారును ఆ ఫంక్షన్ జరిగిన చోటే వదిలేశానని! వెంటనే స్నేహితుడ్ని పిలిచి అక్కడికి వెళ్లి కారు తెచ్చుకున్నాను" అని చెప్పాడు నాని.

  • Loading...

More Telugu News