: ఎస్సై హత్య వెనుక మంత్రులున్నారని వార్తలు వినిపిస్తున్నాయి: మోత్కుపల్లి
రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ హత్య వెనుక తెలంగాణ మంత్రులున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎస్సై హత్య వెనుక ఇసుక మాఫియా ఉందని అంటున్నారని, ఇసుక మాఫియా అంటే ఎవరు? అన్నది నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని ఆయన ఆరోపించారు. సిట్టింగ్ జడ్జ్ తో ఈ కేసు విచారణ చేయించాలని డిమాండ్ చేసిన ఆయన, కేసును సీఐడీకి కాకుండా సీబీఐకి అప్పగించాలని సూచించారు.