: కేసీఆర్ తీరు నీరో చక్రవర్తిలా ఉంది: షబ్బీర్ అలీ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు నీరో చక్రవర్తిలా ఉందని టీకాంగ్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్నట్టుగా, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే... సీఎం విదేశాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన విమర్శించారు. తొలి ఏడాదిలోనే సీఎం కేసీఆర్ 63 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆయన అన్నారు. అందుకే వరల్డ్ బ్యాంక్ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన రాష్ట్రాల్లో 13వ ర్యాంకు ఇచ్చిందని ఆయన చెప్పారు. తాజా చైనా పర్యటన, గత సింగపూర్ పర్యటన ద్వారా కేసీఆర్ తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న పరిశ్రమలకు ఇస్తానన్న రాయితీ 12 వేల కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News