: నేను నా మూలాలు మర్చిపోలేదు...అందుకే ఇప్పటికీ లక్డీకాపూల్ వెళ్తా: శివమణి


ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం తన గురువు బాలసుబ్రహ్మణ్యం నేర్పించారని ప్రముఖ డ్రమ్ వాయిద్య కారుడు శివమణి తెలిపారు. తనను ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఉండేలా ప్రోత్సహించింది, పడమటి సంధ్యారాగం సినిమాలో నటించే అవకాశం ఇచ్చింది, తెలుగు భాష నేర్పింది, జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో చెప్పింది తన గురువు ఎస్పీ బాలసుబ్రమణ్యం అని శివమణి తెలిపారు. కాగా, తాను ఎంత ఎదిగినా తన మూలాలు మాత్రం మర్చిపోలేదని ఆయన వెల్లడించారు. 'హైదరాబాదులో అడుగుపెడితే, ఇప్పటికీ తాను తొలిసారి...కాదు, కాదు...చాలా సార్లు బస చేసిన వెంకటేశ్వరా లాడ్జ్ ను చూస్తా'నని చెప్పారు. తొలిసారి లక్డీకాపూల్ లో అదే హోటల్ లో బసచేశానని శివమణి తెలిపారు. హైదరాబాదులో ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ తో కలిసి ఫ్యూజన్ షో ఏర్పాటు చేస్తానని శివమణి చెప్పారు.

  • Loading...

More Telugu News