: సోనియాతో భేటీ అయిన వీహెచ్... ఆనక కేసీఆర్ పై నిప్పులు చెరిగిన టీ కాంగ్ వృద్ధ నేత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియా గాందీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సోనియాకు వివరించారు. భేటీ అనంతరం బయటకు వచ్చిన వీహెచ్, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆయన విరుచుకుపడ్డారు.