: గవర్నర్ దంపతులకు పాదాభివందనం చేసిన దానం నాగేందర్
ఖైరతాబాదు గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఖైరతాబాదు గణనాథుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసేందుకు వచ్చిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గరవ్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులకు మాజీ మాంత్రి, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాదు శాఖ అధ్యక్షుడు దానం నాగేందర్ పాదాభివందనం చేశారు. గతంలో ఖైరతాబాదు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ మంత్రిగానూ పనిచేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదు వినాయకుడి విగ్రహం వద్దకు చేరుకున్న ఆయన గవర్నర్ దంపతులు అక్కడికి రాగానే వారికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్, ఆయన సతీమణికి ఆయన పాదాభివందనం చేశారు. ఆయన దగ్గరుండి గవర్నర్ దంపతులను గణేశ్ విగ్రహం వద్దకు తీసుకెళ్లారు.