: ఖైరతాబాదు వినాయకుడికి గవర్నర్ దంపతుల పూజలు... నగరంలో ప్రారంభమైన చవితి ఉత్సవాలు
ఖైరతాబాదులో కొలువుదీరిన వినాయకుడి భారీ విగ్రహానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదు వచ్చిన గవర్నర్ దంపతులు అక్కడ ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి తొలి పూజలు చేశారు. తద్వారా నగరంలో గణేశ్ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఇక నగరంలోని వాడవాడలా వెలసిన గణేశ్ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేసి గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం పలికారు. ప్రస్తుతం హైదరాబాదులో గణేశ్ నామస్మరణ మారుమోగుతోంది.