: ఏపీ ఆబ్కారీ శాఖలో భారీగా బదిలీలు... 200 మంది సీఐలు ట్రాన్స్ ఫర్, ఏఈఎస్ లు కూడా


ఏపీలో అధికారులు, సిబ్బంది బదిలీలు జోరందుకున్నాయి. రెవెన్యూ శాఖలో 22 మంది ఆర్డీఓల బదిలీలపై ఇప్పటికే వివాదం నెలకొనగా, తాజాగా ఆబ్కారీ శాఖలో పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి ఆ శాఖలోని 200 మంది సీఐలకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఏఈఎస్)లను కూడా పెద్ద సంఖ్యలోనే బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభ ఆధారంగానే బదిలీ చేశామని చెప్పిన ప్రభుత్వం ఈ బదిలీలన్నీ కూడా ఆంధ్రా పరిధిలోనివేనని పేర్కొంది. ఇక రాయలసీమ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది బదిలీలను మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.

  • Loading...

More Telugu News