: వెంకన్న బ్రహ్మోత్సవాలకు ‘ఆక్సిజన్’ వినూత్న కానుక... దేశవ్యాప్తంగా రూ.10 టాక్ టైమ్ ఫ్రీ!


తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ‘ఆక్సిజన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ భక్తులకు వినూత్న ఆఫర్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు రూ.10 ఫ్రీ టాక్ టైమ్ ను అందించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ప్రమోద్ సస్రేనా ప్రకటించారు. ఈ మేరకు వినూత్న ఆఫర్ ను నిన్న తిరుమలలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆయన ప్రారంభించారు. ఈ ఆఫర్ ప్రకారం వెంకన్న భక్తులు ‘గోవిందా’ అనే అక్షరాలను ఆంగ్లంలో టైప్ చేసి స్పేస్ ఇచ్చి తమ మొబైల్ సర్వీస్ ఆపరేటర్ పేరును చేర్చి 9963900600 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేస్తే, వెనువెంటనే సదరు వినియోగదారుడి మొబైల్ లో రూ.10 ఫ్రీ టాక్ టైమ్ చేరిపోతుంది. ఉదాహరణకు ఎయిర్ టెల్ వినియోగదారులు ‘GOVINDA AIRTEL’ అని టైప్ చేసి సదరు నెంబర్ కు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. వెంకన్న భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రమోద్ సస్రేనా విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News