: చిలీ భూకంపం ప్రభావం విస్తరిస్తోంది... న్యూజిల్యాండ్ లోనూ సునామీ హెచ్చరికలు


చిలీలో నేటి ఉదయం సంభవించిన పెను భూకంపం ప్రభావం పొరుగు దేశాలకూ విస్తరిస్తోంది. రిక్టర్ స్కేలుపై 8.4 తీవ్రతతో కూడిన భూకంపం నేపథ్యంలో చిలీలోనే కాక పెరూ, హవాయి దేశాల్లో సైతం ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజాగా చిలీ పొరుగు దేశం న్యూజిల్యాండ్ లోనూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను వెనువెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ దేశ ప్రభుత్వం అదికారులకు ఆదేశాలు జారీ చేసింది. పడవ ప్రయాణాలు, బోటింగ్ లపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

  • Loading...

More Telugu News