: ఎత్తు తగ్గుతున్న ఖైరతాబాదు గణేశుడు... పెరుగుతున్న విశాఖ గణనాథుడు!


గణనాథుడి ఎత్తు విషయంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్న పోకడలు కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా తెలుగు నేలపై ఎత్తైన గణపతి ప్రతిమ హైదరాబాదులోని ఖైరతాబాదు గణనాథుడిదే. అయితే ‘పొల్యూషన్ ఫ్రీ’, ‘ఎకో ఫ్రెండ్లీ’ చర్యల్లో భాగంగా ఇకపై ఏటా అడుగు మేర గణనాథుడి ఎత్తును తగ్గించాలని ఖైరతాబాదు గణేశ్ ఉత్సవ కమిటీ తీర్మానించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచే సదరు నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించింది. గతేడాది 60 అడుగుల ఎత్తుతో ఖైరతాబాదు గణనాథుడు తయారైతే, ఈ ఏడాది 59 అడుగులకే పరిమితమయ్యాడు. ఏటా అడుగు మేర ఎత్తు తగ్గిస్తూ గణనాథుడి ఎత్తును 5 అడుగులకు తీసుకొస్తారట. విగ్రహం ఎత్తు ఐదడుగులకు చేరుకున్న తర్వాత మట్టికి బదులు ‘పసిడి’తో వినాయకుడి విగ్రహాన్ని రూపొందిస్తారట. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని ప్రధాన నగరాలు విశాఖ, విజయవాడల్లో ఏటేటా గణేశుడి ప్రతిమ ఎత్తు పెరుగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని గాజువాకలో ఏర్పాటు చేసిన వినాయకుడి ఎత్తు 82 అడుగులుంది. ఇక విజయవాడ విషయానికొస్తే, ఘంటసాల కళాశాలలో 69 అడుగుల ఎత్తుతో గణపతి విగ్రహం కొలువుదీరింది. ఈ రెండు విగ్రహాల్లో లేశమాత్రం కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News