: ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ నేత 'విజయ' వీరంగం
ఉత్తరప్రదేశ్ లో రౌడీ రాజ్యం నడుస్తోందనడానికి నిదర్శనమైన ఘటన చోటుచేసుకుంది. మొరాదాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. దీంతో అతని అనుచరులు విజయోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పార్టీ కార్యాలయం చేరుకున్న తరువాత పబ్లిక్ అంతా సందడిగా ఉండగా, ఆనందం పట్టలేకపోయిన పార్టీ అనుచరుడు తుపాకీ తీసి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో తమపైనే కాల్పులు జరుగుతున్నాయని భావించిన సదరు నేత అనుచరులు పరుగు లంఘించుకున్నారు. ఇంతలో విషయం గ్రహించిన ఓ వ్యక్తి సదరు పార్టీ నేతను నిలువరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ములాయం అభ్యర్థి విజయం సాధించాడన్న ఆనందంలో తుపాకీ కాల్చినట్టు ఆయన తెలిపారు.