: ఫ్లైట్ దిగి నేరుగా రామేశ్వరరావు షష్టిపూర్తి కార్యక్రమానికి వెళ్ళిన కేసీఆర్!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పది రోజుల చైనా పర్యటన ముగిసింది. ఈ మధ్యాహ్నం చైనా నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన కేసీఆర్ రాత్రి 8:30 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు కేటీఆర్ మినహా తెలంగాణ కేబినెట్ మొత్తం స్వాగతం పలికింది. సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రహదారికిరువైపులా బారులు తీరాయి. అనంతరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన కేసీఆర్ నేరుగా శంషాబాద్ లోని దివ్యసాకేతంలో జరుగుతున్న మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు షష్టిపూర్తి కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ రామేశ్వరరావు దంపతులను అభినందించిన కేసీఆర్, చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ సంగీత కారుడు శివమణి సంగీతాన్ని ఆస్వాదించారు. కాగా, కేసీఆర్, రామేశ్వరరావు సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే.

  • Loading...

More Telugu News