: ఆ పెయింటింగులు వేల సంవత్సరాల క్రితం నాటివి!
వేల ఏళ్ల క్రితం నాటి 18 వేల పెయింటింగ్స్ చైనాలో లభ్యమయ్యాయి. హెలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని 31 ప్రాంతాల్లో ఈ పెయింటింగులను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. 2012లో తొలి పెయింటింగ్ ను గుర్తించగా, 1,67,000 చదరపు మీటర్ల మేర తవ్వకాలు జరిపి ఈ పెయింటింగులను వెలికి తీసినట్టు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. వీటిలో మనుషులు, జంతువుల ఆకారాలు చిత్రించారని వారు చెప్పారు. మనుషులు పక్షుల ఈకలతో తయారు చేసిన టోపీలు ధరించి ఉన్నారని, అలాగే గుర్రాలు, శునకాలు, పులులు, జింకలు, పక్షులు కూడా ఉన్నాయని వారు తెలిఅపారు. ఈ పెయింటింగ్స్ వేల సంవత్సరాల క్రితం మనిషి జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు.