: తిరిగి హిందూ మతంలోకి వచ్చేయ్: ఏఆర్ రహమాన్ కు వీహెచ్ పీ పిలుపు
మ్యూజిక్ మేస్ట్రో ఏఆర్ రహమాన్ ను తిరిగి హిందూ మతంలోకి రావాల్సిందిగా విశ్వహిందూ పరిషత్ సూచించింది. 'మహమ్మద్, మెసేంజర్ ఆఫ్ గాడ్' సినిమాకు సంగీతం అందించినందుకు గాను ముంబైకి చెందిన రజా అకాడెమీ అనే ముస్లిం సంస్థ రెహమాన్ కి ఫత్వా జారీ చేసింది. ఇలాంటి ఫత్వాలకు భయపడాల్సిన పని లేదని వ్యాఖ్యానించిన వీహెచ్ పీ 'ఇంకా ముస్లిం మతంలో సాగాల్సిన అవసరం ఉందా? తిరిగి హిందూ మతంలోకి వచ్చెయ్' అంటూ ఆయనకు సూచించింది. హిందూ మతంలో ఫత్వాలు జారీ చేయమని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు. హిందూ సమాజం తన కుమారుడైన రహమాన్ తిరిగి రావాలని కోరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.