: జగన్, చిరంజీవి ముచ్చట్లు...'మై హోమ్' అధినేత వేడుకల్లో అరుదైన దృశ్యం!
మై హోం గ్రూప్ సంస్థల అధినేత రామేశ్వరరావు షష్టిపూర్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హైదరాబాదులోని త్రిరంగానగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత చిరంజీవి సతీ సమేతంగా వచ్చారు. రామేశ్వరరావుపై రచించిన పుస్తకాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించి తొలి కాపీని చిరంజీవికి అందజేశారు. అదే సమయంలో అక్కడికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ వచ్చారు. దీంతో రామేశ్వరరావు కుటుంబ సభ్యులు జగన్ ను చిన్నజీయర్ స్వామి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామేశ్వరరావు చిరంజీవి, జగన్ లను చెరో చేత్తో పట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, జగన్ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ సన్నివేశం అక్కడున్న అందర్నీ అలరించింది. కాగా, ఈ కార్యక్రమానికి పురంధేశ్వరి దంపతులు, ఎర్రబెల్లి, డీఎస్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, వడ్డే నవీన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలగాయని సూర్యగాయత్రి పాడిన హనుమాన్ ఛాలీసా అందర్నీ ఆకట్టుకుంది.