: మళ్లీ క్రికెట్ మైదానంలో తలపడనున్న సచిన్, వార్న్... న్యూయార్క్ లో మాజీ దిగ్గజాల టోర్నీ!


దిగ్గజ మాజీ క్రికెటర్లు అమెరికాలో నిర్వహించనున్న టోర్నీకి ఐసీసీ ఆమోదముద్ర వేసింది. ప్రపంచ క్రికెట్లోని టెస్టులాడే దేశాల్లో రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. తాజా మాజీలు సహా దిగ్గజ క్రికెటర్లెందరో ఈ టోర్నీ ద్వారా అభిమానులను అలరించనున్నారు. న్యూయార్క్ లో నిర్వహించనున్న ఈ టోర్నీలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక జట్టుకు నాయకత్వం వహించనుండగా, మరో జట్టుకు షేన్ వార్న్ నాయత్వం వహించనున్నాడు. ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడంతో దిగ్గజాల ఆటను చూసే అవకాశం లేదని భావించిన అభిమానులను ఈ టోర్నీ ద్వారా అలరిస్తామని సచిన్, వార్న్ తెలిపారు. ఈ టోర్నీలో ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, పాంటింగ్, లారా, పీటర్సన్, గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ, మెక్ గ్రాత్, జయసూర్య, సంగక్కర, జయవర్ధనే, చమిందా వాస్, మైకేల్ క్లార్క్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా మరోసారి అభిమానులను అలరించనున్నారు.

  • Loading...

More Telugu News