: సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి... ఈ రాత్రి చెల్లెలి నిశ్చితార్థం
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన చెల్లెలు ఆనమ్ మీర్జా వివాహ నిశ్చితార్థం ఈ రాత్రి నగరంలోని ఓ స్టార్ హోటల్ లో జరగనుంది. దగ్గరి బంధువులు, 200 మంది స్నేహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాదుకే చెందిన అడ్వర్టయిజింగ్ ప్రొఫెషనల్ అక్బర్ రషీద్, సానియా చెల్లెలు ఆనమ్ లు గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారట. వీరి ప్రేమను ఇరువైపుల పెద్దలూ అంగీకరించడంతో... సానియా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నిశ్చితార్థ వేడుకలో సానియా సిస్టర్స్ డిజైనరీ వేర్ లో మెరవనున్నారట. మరోవిషయం ఏమిటంటే, యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి, అమెరికా నుంచి వచ్చిన సానియా మీర్జా ఆ ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేయకుండానే... నిశ్చితార్థం పనుల్లో బిజీ అయిపోయింది!