: అసమర్థ ప్రభుత్వంతో తెలంగాణకు 13వ ర్యాంకే వస్తుంది: లక్ష్మణ్
పెట్టుబడులకు సానుకూలమైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు 13వ ర్యాంక్ రావడంపై ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ఈ జాబితా వాస్తవాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే తెలంగాణకు ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తలా తోకా లేకుండా ఉన్నాయని... ఇప్పటికే ఎన్నోసార్లు కోర్టుతో మొట్టికాయలు కూడా వేయించుకుందని విమర్శించారు. కీలకమైన విషయాల్లో కూడా ప్రభుత్వ అసమర్థత కనిపిస్తోందని అన్నారు.