: బీహార్ లో మొదలైన నామినేషన్ల పర్వం


బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి దశ ఎన్నికలకు ఈరోజు నుంచి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 23లోగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. 24న నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు చివరితేదీ ఈ నెల 26. అక్టోబర్ 12న మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా తొలిదశలో 49 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News