: ఐసీఐసీఐ ఏటీఎంను లేపేశారు!


ఏటీఎంను బద్దలు కొట్టి డబ్బులేం తీసుకెళ్తాం, ఏకంగా ఏటీఎంనే లేపేద్దామని భావించినట్టున్నారు ఆ దొంగలు. అందుకే, పంజాబ్ లోని పగ్వారా జిల్లాలో ఐసీఐసీఐ బ్యాంకు ఏర్పాటు చేసిన ఏటీఎంను కొందరు దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఏటీఎంలో 3.34 లక్షల నగదు ఉన్నట్టు బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. ఏటీఎం లేకపోవడం గుర్తించిన సెక్యూరిటీ గార్డు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు వచ్చి దొంగతనాన్ని నిర్థారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈమధ్య కాలంలో పంజాబ్, హర్యాణాల్లోని దొంగలు ఏకంగా ఏటీఎంలను లేపేస్తున్నారు.

  • Loading...

More Telugu News