: ఏపీ పొగాకు బోర్డు ఛైర్మన్ విధుల నుంచి తొలగింపు


ఆంధ్రప్రదేశ్ పొగాకు బోర్డు ఛైర్మన్ గోపాల్ పై వేటు పడింది. ఆయనను విధుల నుంచి తొలగిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు. పొగాకు సంక్షోభంపై ఈ రోజు మంత్రి ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పొగాకు సంక్షోభం నెలకొన్న సమయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఇటలీ పర్యటనకు వెళ్లిన గోపాల్ పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పొగాకు బోర్డు ఛైర్మన్ గా సీనియర్ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా నిర్మలా సీతారామన్ ఎల్లుండి ఏపీలో పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News