: వరంగల్ లో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలకు కోర్టు ఆదేశాలతో ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తాడ్వాయి మండలంలోని నార్లాపూర్-మేడారం అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో కేకేడబ్ల్యూ (కరీంగనర్, ఖమ్మం, వరంగల్) దళ సభ్యులు తంగెళ్ల శృతి అలియాస్ మహిత (24), మణికంట విద్యాసాగర్ రెడ్డి అలియాస్ సూర్యం అలియాస్ సత్యం (33)లు మరణించారు.