: టీఆర్ఎస్ దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తకు రేవంత్ రెడ్డి పరామర్శ


టీఆర్ఎస్ వర్గీయలు చేసిన దాడిలో గాయపడి, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త చందూలాల్ ను ఈ రోజు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలోని టీడీపీ నేతలను టీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో చేరని టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. చందూలాల్ పై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చందూలాల్ కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News