: బస్సులో కిడ్నాప్ చేసి...నగలతో ఉడాయించారు


పండగ సందర్భాల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాదులోని కొత్తపేటలో నివాసముండే సంతోష (22) కుమార్తెతో కలిసి నల్గొండ జిల్లా ఆత్మకూరులోని పుట్టింటికి వెళ్లేందుకు బయల్దేరి, ఉప్పల్ లో భువనగరి బస్సు ఎక్కింది. ప్రయాణంలో నగలు ధరించడం ప్రమాదం అని భావించిన ఆమె, హ్యాండ్ బ్యాగ్ లో 8 తులాల బంగారం పెట్టింది. వెనుక సీట్లోని ఇద్దరు మహిళలు సంతోష కుమార్తెను తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో ఆమెను మగత కమ్ముకుంది. లేచి చూసేసరికి చేతిలో ఉండాల్సిన బ్యాగు, తన కుమార్తె, వెనుక సీట్లోని మహిళలు కనపడలేదు. దీంతో ఆమె బస్సు దిగి బీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత్తుచల్లి నగలు, పాపతో ఇద్దరు మహిళలు ఉడాయించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మత్తు పూర్తిగా వదలని ఆమె గందరగోళంలో ఉందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News