: ఆంధ్రజ్యోతి రైతు సంక్షేమ నిధికి రేవంత్ రెడ్డి విరాళం
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రైతు సంక్షేమ నిధికి టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి విరాళం ప్రకటించారు. లక్ష రూపాయల విరాళాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. తానిచ్చే లక్షతో రైతుల కష్టాలు తీరవని రేవంత్ అన్నారు. ప్రభుత్వమే రైతుల అవస్థలను గుర్తించి పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలకు సాయం చేసేందుకు ఆంధ్రజ్యోతి రైతు సంక్షేమ నిధిని ప్రారంభించింది.