: బంగారు తెలంగాణ అంటే ఇంటింటికీ తులం బంగారం ఇవ్వడం కాదు: కేటీఆర్


ప్రత్యేక తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చాక 'బంగారు తెలంగాణ' అంటూ టీఆర్ఎస్ పార్టీ కొత్త నినాదం అందుకుంది. తాజాగా దానిపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ అంటే ఇంటింటికీ తులం బంగారం ఇవ్వడం కాదని చెప్పారు. సాగు, తాగునీరు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడటమే బంగారు తెలంగాణ అని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుంది తప్ప అభివృద్ధికి అడ్డుపడే ప్రతిపక్షాలకు కాదన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుపై కేటీఆర్ ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము అక్రమ ప్రాజెక్టులు కడుతున్నామంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News