: 'నక్సల్స్ ఎజెండా' అంటూ కేసీఆర్ ప్రజలను మోసం చేశారు: మంద కృష్ణ


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వరంగల్ జిల్లాలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ పై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మరణించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. నక్సల్స్ ఎజెండా అమలు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ వచ్చాక ఎన్ కౌంటర్ పేరుతో ప్రజలకు బహుమతి ఇచ్చారని విమర్శించారు. వరంగల్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగానే యువత మావోయిస్టుల్లో చేరుతున్నారన్నారు. కేసీఆర్ కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News