: తెలంగాణ తాగునీటి పథకానికి కేటీఆర్ శంకుస్థాపన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల వద్ద తెలంగాణ తాగునీటి పథకం ఎల్లూరు సెగ్మెంట్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పాలమూరు వేదికగా వాటర్ గ్రిడ్ పనులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికే వాటర్ గ్రిడ్ కు శంకుస్థాపన చేశామని చెప్పారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.