: షార్ట్ ఫిల్మ్ కు నిర్మాతగా కరీనాకపూర్!


బాలీవుడ్ నటి కరీనాకపూర్ నిర్మాతగా మారబోతోంది. అది కూడా మహిళా ప్రధాన కథతో రూపొందే షార్ట్ ఫిల్మ్ కు నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని కరీనా స్కూల్ ఫ్రెండ్ అదితి కపూర్ తీయనుంది. వాళ్లిద్దరూ డెహ్రాడూన్ లోని వెల్హామ్ గర్ల్స్ స్కూల్ లో చదువుకున్నారట. ఇటీవల కరీనాకు అతిథి ఓ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టు వినిపించగా వెంటనే దానికి నిర్మాతగా ఉండేందుకు ఒప్పుకుందని అంటున్నారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News