: ఈ శతాబ్దపు అద్భుతం కళ్లముందు సాక్షాత్కరించిన వేళ..!
ఇండియాలో నదుల అనుసంధానం. భారత ప్రధానిగా వాజ్ పేయి కొనసాగుతున్న సమయంలో వచ్చిన ఆలోచన. అది కార్యరూపం దాల్చేసరికి ఎన్నో ఏళ్లు పట్టింది. గోదావరి నదీ జలాలు కృష్ణమ్మ సన్నిధికి చేరిన శుభవేళ... ఇండియాలో ఈ శతాబ్దపు అద్భుతం కళ్లముందు సాక్షాత్కరించిందని, ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన వేలాది మంది కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు వ్యాఖ్యానించారు. పవిత్ర నదుల సంగమ స్థలంలో పుణ్యస్నానాలు చేసి నదీమ తల్లులకు ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మ, కృష్ణమ్మ తల్లులకు హారతులిచ్చి పసుపు, కుంకుమలు సమర్పించారు. ఇక సాధ్యమైనంత త్వరలోనే రాయలసీమకు అదనపు జలాలను తరలించి, అక్కడి బీడు భూములను మాగాణులుగా మార్చే పని తలపెడతామని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.