: పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన హాలీవుడ్ నటి అరెస్ట్
13 సంవత్సరాల వయసున్న పిల్లల ముందు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించిన అమెరికన్ నటి జెన్నిఫర్ లియెన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు వారాల క్రితం జెన్నిఫర్, తన పక్కింట్లో ఉండే కారే స్మిత్ అనే గృహిణితో గొడవ పడింది. స్మిత్ పిల్లలు ఏడుస్తుంటే, జెన్నిఫర్ దుస్తులు విప్పి గేలి చేసింది. జరిగిన విషయాన్ని పిల్లలు తమ తల్లితో చెబితే, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణకు వస్తే, వారితో సైతం దురుసుగా ప్రవర్తించింది. కేసు నమోదు చేసిన పోలీసులు జెన్నీఫర్ ను అరెస్ట్ చేశారు. ఆపై జైలుకు తరలించగా, రూ. 1.65 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెకు బెయిల్ లభించింది.