: ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది: వరవరరావు ఫైర్


కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని విరసం నేత వరవరరావు మండిపడ్డారు. వరంగల్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టుల అజెండానే టీఆర్ఎస్ అజెండా అని చెప్పుకున్న కేసీఆర్ ప్రభుత్వం ... మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టులు శృతి, సాగర్ రెడ్డిలకు ఈ రోజు వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మృత దేహాలను పరిశీలించేందుకు వరవరరావు మార్చురీలోకి వెళ్లబోయారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విరసం నేతలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా, వరవరరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News