: నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని... నేడు వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ చేశారు: ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా మేడారం మండలం తాడ్వాయి అటవీ ప్రాంతంలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని టి.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన శృతి, విద్యాసాగర్ రెడ్డిని పోలీసులే తీసుకెళ్లి కాల్చి చంపారని విమర్శించారు. వారిద్దరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నక్సల్స్ అజెండానే తమ అజెండా అని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాట తప్పారని హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు సానుభూతి తెలిపారు.