: భారతరత్న కోసం శివసేన సిఫారసు చేసిన వ్యక్తి ఇతనే...!
దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కోసం వివిధ రాజకీయ పార్టీలు తమకు నచ్చిన వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ వాది అయిన వీరసావర్కర్ కు భారతరత్న ఇవ్వాలని శివసేన కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వీరసావర్కర్ దేశం గర్వించదగ్గ నేత అని, ఆయనను భారతరత్న పురస్కారంతో గౌరవించడమే కాక, అండమాన్ లోని సెల్యులార్ జైలు వద్ద ఆ పురస్కారాన్ని ప్రదానం చేయాలని లేఖలో కోరారు. సావర్కర్ ను బ్రిటీష్ ప్రభుత్వం అండమాన్ జైల్లో బంధించిన నేపథ్యంలో ఉద్దవ్ థాకరే ఈ సూచన చేశారు.