: ఢిల్లీ పోలీసుల ముందు లొంగిపోయిన్ సోమ్ నాథ్ భారతి
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసుల ముందు లొంగిపోయారు. ఢిల్లీ కోర్టు ఆయన అరెస్టుపై రేపటి వరకు గడువు ఇచ్చినప్పటికీ ఒకరోజు ముందుగానే సరెండర్ అవడం గమనార్హం. భార్య లిపికా మిత్ర పెట్టిన గృహహింస, హత్యాయత్నం కేసుల్లో పోలీసుల విచారణకు సహకరించాలని నిర్ణయించుకుని నేరుగా పోలీసుల ముందుకు వెళ్లినట్టు తెలిసింది. ఈ విషయంపై నిన్న పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించగా నేరుగా పోలీసుల ముందుకు వెళ్లి విచారణకు హాజరవడం మంచిదని సూచించారు. ఈ నేపథ్యంలోనే సోమ్ నాథ్ స్వయంగా పోలీసులు ముందు లొంగిపోయినట్టు సమాచారం.